Departments


  • Telugu
    • B.Venkateshwarlu

      Assistant professor of Telugu

       

      విద్యార్హతలు: ఎం.కాం, ఎం.ఏ(తెలుగు), ఎం.ఏ (సంస్కృతం), తెలుగు పండిత శిక్షణ, UGCNET, APSET (Ph.D)

      రచనలు: 

      • వాకిలి(వచన కవిత్వం) 2007 (ISBN 978-93-5156-014-2)

      • రంగుల విల్లు(నానీలు) 2007 (ISBN 978-93-5156-013-5)

      • పెద్ద కచ్చురం (కవిత్వం) 2013 (ISBN 978-93-5156-015-9)

      • బాయి గిర్క మీద ఊరవిశ్క (కవిత్వం) 2015

      • రెండు పక్షులూ ఒక జీవితం (కవిత్వం)2017

      • ప్రాణ గంధం (కవిత్వం)2021

      సహసంపాదకత్వం: 

      • ఆంధ్ర సారస్వత పరిషత్ ఛాత్రోపాధ్యాయ పత్రిక శ్రీముఖి 1997

      • కరీంనగర్ కవిత - 2011

      • కరీంనగర్ కవిత – 2012

      • నవనీతం (డా.నలిమెల బాస్కర్ సాహిత్యం పై విశ్లేషణ) 2013

      • వస్త్రగాలం ( అన్నవరం దేవేందర్ కవిత్వం పై వివేచన) 2013

      • ఎన్నీల ముచ్చట్లు (2013 ఆగస్టు నుండి)

      • పాల్కురికి సోమన పద ప్రయోగ సూచిక 2018

      • తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ తెలుగు వాచక సంపాదక మండలి సభ్యుడు 2020

      పురస్కారాలు/బహుమతులు: 

      1. స్పందన సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఒరిస్సా వారి జాతీయ స్థాయి వచన కవితా పోటీల్లో ద్వితీయ బహుమతి/2005.

      2. సాహితీ మిత్రులు మచిలీపట్నం వారి వారి జాతీయ స్థాయి వచన కవితా పోటీల్లో ద్వితీయ బహుమతి/2007.

      3. కళాలయ సాంస్కృతిక సంస్థ పాలకొల్లు వారి విశిష్ట పురస్కారం, యువకవిరత్న బిరుదు/2007.

      4. “ఎక్స్ రే” ఉత్తమ కవిత అవార్డు/2007.

      5. చెలిమి సాంస్కృతిక సంస్థ విజయవాడ వారి దేవులపల్లి కృష్ణ శాస్త్రి స్మారక అవార్డు/2008.

      6. ఆంధ్ర భూమి దినపత్రిక స్వర్ణోత్సవ కవితల పోటీ జాతీయస్థాయి తృతీయ బహుమతి/2009.

      7. రంజని-కుందుర్తి ఉత్తమ కవిత అవార్డు/ 2010.

      8. భూంపల్లి విజయ సమైక్య సాహితీ పురస్కారం/2013.

      9. అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం/2018.

      10. సాహితీ సౌరభాలులో - దూరదర్శన్ వారి చేత ఇంటర్వ్యూ 04/05/2018

      11. విశాల సాహిత్య అకాడమి- బి.ఎస్ రాములు స్ఫూర్తి పురస్కారం 23/08/2019

      11. TORI రేడియో అక్షరాల తెర కార్యక్రమంలో కవిత్వ పరిచయం 13/01/2020 


      ప్రస్తుత చిరునామా: శాశ్వత చిరునామా:

      ప్లాట్ నెం. 403, వేంకటేశ్వర టవర్స్ ఇం.నెం. 3-64/1,

      సాధన పబ్లిక్ స్కూల్ దగ్గర గ్రా. లాలపల్లి, 

      జ్యోతినగర్, కరీంనగర్-1 మం.ఎలిగేడు, జి.పెద్దపల్లి – 505525 

      Mobile: 9491598040

      Gmail:  boorlatelugu@gmail.com

      www.facebook.com/Boorla/

      https://satavahana.academia.edu/venkateshwarluboorla

      https://scholar.google.co.in/citations?hl=en&user=zcF2H2AAAAAJ

      https://www.youtube.com/channel/UCBSMlQz037ZsSE7LxZi2CtQ?view_as=public


      కవిత్వం గురించి రెండు మాటలు: 

      సకల ఆధిపత్యాలనూ ధిక్కరించడం. ప్రజా పక్షం వహిస్తూ మానవీయ సమాజం కోసం కవిత్వాన్ని వాహికగా చేసుకోవడం. తెలంగాణ భాషా సాహిత్య అస్తిత్వాల రక్షణకు పాటుపడడం. మానవత్వమే మతమని, ఎల్లలులేని ప్రేమ విశ్వశాంతి సాధనమని విశ్వసించడం.


      ఉద్యోగ వివరాలు: 

      • ద్వితీయ శ్రేణి తెలుగు పండితుడు (Telugu pandit Grade-II) : 27/10/1998 to 16/10/2002

      • ప్రథమ శ్రేణి తెలుగు పండితుడు (Telugu pandit Grade-I) : 17/10/2002 to 21/12/2004

      • జూనియర్ ఉపన్యాసకుడు (Junior Lecturer): 22/12/2004 to 20/05/2013

      • సహాయ ఆచార్యుడు (Assistant Professor): 21/05/2013- till now

      ప్రచురిత వ్యాసాలు:

      • 1. “భరతుడు” ఆంధ్రభూమి దినపత్రిక 26.11.2008
      • 2. “చక్కని తెలుగు ఇక్కడుంది” ఆంధ్రభూమి దినపత్రిక 19.10.2009
      • 3. “ఎన్నీల ముచ్చట్లు” నమస్తే తెలంగాణ దిన పత్రిక బతుకమ్మ 17.11.2013
      • 4. “ప్రపంచీకరణ పై మూడో కన్ను” సూర్య దినపత్రిక 26.05.2014
      • 5. “బసవపురాణం మీద ప్రమాణం జేసి” నమస్తే తెలంగాణ దిన పత్రిక 08.06.2014
      • 6. “బసవ పురాణము-ప్రజల భాష” జాతీయ సదస్సు సంచిక – ప్ర.డి.కళాశాల జోగిపేట ఆగష్టు 2014
      • 7. “తెలంగాణ ఉద్యమ పాట-నాస్టాల్జియా” నమస్తే తెలంగాణ దినపత్రిక 02.03.2015
      • 8. “తెలంగాణ భాష-ఇప్పటి ముచ్చట” ఆంధ్రజ్యోతి దిన పత్రిక 12.03.2015
      • 9. “ప్రజల భాషకు పట్టం గట్టిన పాల్కురికి” తెలంగాణ సంస్కృతీ తొలి ఆవిష్కర్త –పాల్కురికి సోమనాథుడు-సంపా. డా.అనుమాండ్ల భూమయ్య. జూన్ 2015
      • 10. “భాషా ప్రసాదం వడ్డించిన బువ్వకుండ” దక్కన్ ల్యాండ్ మాస పత్రిక నవంబర్ 2016
      • 11. “అలిశెట్టి జీవించు ప్రజల నాలుకలయందు” నవ తెలంగాణ దినపత్రిక 09.01.2017
      • 12. “తెలంగాణ భాషా కోశాలు ఒక పరిచయం” జాతీయ సదస్సు సంచిక SRR ప్ర.డి.క ISBN 978-93-5267-693-4
      • 13. “పొట్లపల్లి రామారావు నాటికల్లో దేశీ తెలుగు” శతజయంతి జాతీయ సదస్సు సంచిక  
      • సంపా. డా. జయధీర్ తిరుమల రావు 10.11.2017
      • 14. “సుక్క పొద్దు పొడవంగ” తెలంగాణ ప్రభుత్వ మాస పత్రిక డిసెంబర్ 2017 
      • 15. “తెలంగాణ భాష కూరాడు కుండలు” దక్కన్ ల్యాండ్ మాస పత్రిక డిసెంబర్ 2017
      • 16. “తెలుగు భాషకు ఇంకో పేరు తెలంగాణ” నమస్తే తెలంగాణ దిన పత్రిక 15.12.2017
      • 17. “కొత్త తొవ్వ తీసిన ఎన్నీల ముచ్చట్లు” నవ తెలంగాణ దినపత్రిక 18.06.2018
      • 18. “సోమన్న వినిపించెను మనమాట” నమస్తే తెలంగాణ దినపత్రిక 17.09.2018
      • 19. “వచన కవిత్వ ప్రక్రియ” ‘సింధూరం’ DIET కరీంనగర్, జనవరి 2019
      • 20. “కేతన ఆంధ్ర భాషా భూషణము-తెలంగాణ తెలుగుదనము” దక్కన్ ల్యాండ్ ఫిబ్రవరి 2019 ISSN 2581-3188
      • 21. “ఆంధ్ర మాహా భారతములో కణిక నీతి – నేటి చూపు” జాతీయ సదస్సు సంచిక, 
      • SRR ప్ర.డి.క, కరీంనగర్ 2020, ఫిబ్రవరి 26. ISBN NO. 978-93-5406-426-5
      • 22. “నిరంతర భాషా కృషీవలుడు” ఆంధ్రజ్యోతి దినపత్రిక, 28 డిసెంబర్ 2020.
      • 23.  “తెలంగాణ భాషా కవిత్వ జెండా” గోదావరి ఆన్ లైన్ ఏప్రిల్ 2020
      • 24. “తెలంగాణ తెలుగు ప్రాచీనతా నిదర్శనం” నవ తెలంగాణ దినపత్రిక 22 మార్చ్ 2021.
      • 25. “సరిహద్దుల్లేని మానవత కోసం తండ్లాట” పాల పిట్ట మార్చ్ 2021.  ISSN No.2582-7294
      • 26. “మూలవాసి కవి అన్నవరం దేవేందర్” సబాల్టర్న్ బులెటిన్ –VI ఏప్రిల్ 2021.
      • 27. “అలిశెట్టి కవిత్వం ప్రాసంగికత” ప్రజా సాహితి ఏప్రిల్ 2021.
      • 28. “ఆపత్కాలపు కవిత్వ చూపు” అమ్మనుడి మాస పత్రిక, ఏప్రిల్ 2021. ISSN No.2582-8738
      • 29. “సామాజిక చలనాలకు కవిత్వ సాక్షి ” సాక్షి  దిన పత్రిక 21 జూన్ 2021
      • 30. ‘వరాల తెలుగులు రెండూ ఒకటే’ ఆంధ్రజ్యోతి దిన పత్రిక 21 అక్టోబర్ 2021.
      • 31. “సామాజికత సమకాలీనతల కలబోత తెలంగాణ  రుబాయీలు” 
      • పాలపిట్ట మాస పత్రిక డిసెంబర్ 2021 ISSN No : 2582-7294
      • ప్రచురిత ముందు మాటలు:
      • 1. “బాట” కరీంనగర్ కవిత-2012 కు సహసంపాదకునిగా ముందుమాట
      • 2. “బహుజన హిత కవిత్వం” కూకట్ల తిరుపతి కవిత్వం ‘ఎర్రగాలు’ పుస్తకానికి ముందుమాట 2015
      • 3. “రెండో అడుగుకు భరోసా” మల్లోజుల త్రివిక్రమ శర్మ ‘అక్షర నీరాజనం’ కవిత్వానికి ముందుమాట జూన్ 2015
      • 4. “దళిత బహుజన కవితా దీపధారి” తప్పెట ఓదయ్య ‘మొగ్గపూసలు’ కవిత్వానికి ముందు మాట మే 2016
      • 5. “మానవీయ కవితా హృదయ భావ శబ్ద వేణు నాదం” మమత వేణు ‘మల్లె చెట్టు చౌరస్తా’ కు ముందు మాట జూన్ 2017. 
      • 6. “గీత మార్చే కవి” మెరుగు ప్రవీణ్ ‘జీవన ప్రయాణం’ కవిత్వానికి ముందుమాట 2017
      • 7. “మనిషిగా మసలిన కవిత్వం” పెనుగొండ బసవేశ్వర్ ‘ఆకాశమంత పావురం’ కవిత్వానికి ముందుమాట నవంబర్ 2018. 
      • 8. “భావాల మార్పుకై కవిత్వాక్షరాల కూర్పు” మహ్మద్ నసీరుద్దీన్ ‘నడిచి వచ్చిన సూర్యుడు’ కవిత్వానికి ముందుమాట మార్చ్ 2019. 
      • 9. “హృదయ కల్లోల కవిత్వం” పెనుగొండ సరసిజ కవిత్వం ‘ఇక మారాల్సింది నువ్వే’ కు ముందుమాట నవంబర్ 2021
      • నిర్వహించిన ముఖాముఖిలు
      • జూకంటి జగన్నాథం గారితో ఆంధ్రజ్యోతి నగునూరి శేఖర్, సూరేపల్లి సుజాత, అన్నవరం దేవేందర్ లతో కలిసి

      • డా.నలిమెల భాస్కర్ గారితో – సూర్య దినపత్రిక 24 మార్చి 2014

      • అనిశెట్టి రజిత గారితో సారంగ సాహిత్య వారపత్రిక 21 జనవరి 2016

      • డా.నలిమెల భాస్కర్ గారితో- సారంగ సాహిత్య వారపత్రిక 3మార్చ్ 2016

      • అన్నవరం దేవేందర్ గారితో- సారంగ సాహిత్య వారపత్రిక 13జూలై 2016

      • పి.చంద్ గారితో- సారంగ సాహిత్య వార పత్రిక 6 డిసెంబర్ 2016

      • డా.నలిమెల భాస్కర్ గారితో సబాల్టర్న్ ఏప్రిల్ 2019

      • గాజోజు నాగభూషణం గారితో- పాలపిట్ట జనవరి 2020

      • డా.నలిమెల భాస్కర్ గారితో – గోదావరి ఆన్లైన్ ఏప్రిల్ 2020

      •  

      హాజరైన సదస్సులు, సమావేశాలు తదితరాలు

      (Orientation Course, Refresher courses, Seminars, workshops & conferences, Online Teaching(MANA TV)

      •  15th July to 17th July 2013 లలో CCE ఆధ్వర్యంలో SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయిలో జరిగిన A Foundation course in Human values & Professional Ethics కార్యక్రమంలో పాల్గొనడమైనది.

      • 20, 21 సెప్టెంబర్ 2013లలో శాతవాహన విశ్వవిద్యాలయంలో జరిగిన ‘గ్రంథాలు, శాసనాలు, సాహిత్య చరిత్రల పునర్మూల్యాంకనం’ జాతీయ సదస్సులో పాల్గొనడమైనది.

      • 5th, 6th November 2013 లలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన మహాకవి దాశరథి సాహిత్య సమాలోచన జాతీయ సదస్సులో పాల్గొనడమైనది.

      • తేది: 28, 29 జనవరి 2014నాడు కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన యు.జి.సి జాతీయ సదస్సుకు తెలంగాణ కథ-మాండలికం అను అంశంపై పంపిన పత్రం ఆమోదం పొందినది. ధృవీకరణ పత్రం అందినది.

      • తేది: 1&2ఆగష్టు 2014 నాడు నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ పి.జి కళాశాల జోగిపేట ఆధ్వర్యంలో నిర్వహించబడిన యు.జి.సి-సెరో జాతీయ సదస్సులో పాల్గొని బసవ పురాణము- ప్రజల భాష అను పత్ర సమర్పణ చేయనైనది. ధృవీకరణ పత్రము తో సహా పుస్తకములోనూ వ్యాసం ముద్రితమైనది.

      • తేది: 4డిసెంబర్2014 నుండి 31డిసెంబర్2014 వరకు యు.జి.సి ప్రాయోజిత ఓరియంటేషన్ కోర్స్(OC) మౌలానా ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయంలో పాల్గొని A గ్రేడు పత్రము పొందడమైనది.

      • తేది: 6జనవరి2015 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొని తెలంగాణ ఉద్యమ పాట – నాస్టాల్జియా అను అంశం పై పత్ర సమర్పణ చేయడమైనది.

      • తేదీ: 07మార్చి2015 నుండి 13మార్చి2015 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సేవా పథకం (NSS) ‘Orientation Course for NSS Programme officers’ లో పాల్గొనడమైనది.

      • తేదీ: 15&16 మే 2015 లలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు సాహితీ సోపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కవిత్వ కార్యశాలలో పాల్గొనడమైనది.

      • తేదీ: 19&20 ఏప్రిల్ 2016 లలో CCE ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘Nurturing young Leaders in Higher Education” కార్యక్రమంలో పాల్గొనడమైనది.

      • తేదీ: 20&21 మే, 2016 లలో CCE ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘Exploring Creative Skills in Students of Govt. Degree Colleges” కార్యక్రమంలో పాల్గొనడమైనది.

      • తేదీ: 6జూన్ 2016 నుండి 25జూన్2016 వరకు JNTU హైదారాబాద్ ఆధ్వర్యంలో జరిగిన UGC ప్రాయోజిత “Strategies for Research oriented Teaching” పునశ్చరణ తరగతులలో (RC1) పాల్గొని ‘A’ గ్రేడుతో పూర్తిచేయనైనది.

      • తేదీ: 17,18 ఫిబ్రవరి, 2017 నాడు SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొని ‘తెలంగాణ భాషా కోశాలు ఒక పరిచయం’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది. ISBN: 978-93-5267-693-4

      • తేదీ: 21 ఫిబ్రవరి, 2017 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని నిర్వహించిన Choice Based Credit System ఒకరోజు వర్క్ షాప్ లో పాల్గొనడమైనది.

      • తేదీ: 25, 26 మార్చ్ 2017 నాడు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ& పి.జి కళాశాల, హన్మకొండ జాతీయ సదస్సులో పాల్గొని ‘కాళోజీ ఆత్మ కథ –స్ఫూర్తి’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది.

      • తేదీ: 4,5,6 జూన్ 2017లో CCE హైదరాబాద్ ఆధ్వర్యంలో Innovative Online Teaching (D-Sampada) అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొనడమైనది.

      • తేదీ: 20 నవంబర్ 2017 నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పొట్లపల్లి రామారావు శతజయంతి జాతీయ సదస్సులో పాల్గొని ‘పొట్లపల్లి రామారావు నాటికల్లో దేశీ తెలుగు’ అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది. సదస్సు సంచికలో వ్యాసం అచ్చైనది.

      • తేదీ: 11 ఆగష్టు 2018న తెలంగాణ సాహిత్య అకాడమి, తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో తెలంగాణ సాహిత్య పరిశోధన విశ్లేషణ అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది.

      • తేదీ: 6నవంబర్ 2019 నాడు జిల్లా విద్యాధికారి కరీంనగర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయ శిక్షణా శిబిరంలో వక్తగా పాల్గొని ‘వచన కవిత్వం ఆలంకారిక శైలి’ అనే అంశంపై ఉపన్యసించడమైనది.

      • తేదీ: 25,26 డిసెంబర్ 2019 లలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కథా రచన కార్యశాలలో పాల్గొనడమైనది. 

      • తేదీ 21 జనవరి 2020నాడు రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం బాసర(IIIT) లో కవిత్వం రాయడం ఎలా అనే శిక్షణా శిబిరంలో శిక్షకునిగా పాల్గొనడమైనది.

      • తేదీ: 25, 26 ఫిబ్రవరి, 2020 నాడు SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొని ‘మహా భారతంలో కణిక నీతి’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది.

      • ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట 6th July to 11th July 2020  లలో నిర్వహించిన Sustainability of Institutions of Higher Learning in the context of Covid-19: Challenges and Perspectives” FDP లో పాల్గొనడమైనది.

      • ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ 13th July to 18th July 2020 మధ్య నిర్వహించిన Innovation in Higher Education – A Teaching learning approach” FDP లో పాల్గొనడమైనది.

      • తేదీ: 21జూలై2020 నుండి 04ఆగష్టు2020 వరకు  UGC – HRDC ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన Refresher course in Language, literature and Cultural studies (Telugu) అంతర్జాల పునశ్చరణ తరగతులలో (RC2) పాల్గొని A గ్రేడుతో పూర్తి చేయడమైనది.

      • ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్కాల్ తేదీ: 23-25ఆగష్టు 2020లలో ఆన్లైన్లో నిర్వహించిన Innovations for New Normal అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడమైనది.

      • తేదీ: 27ఆగష్టు2020 నుండి 02సెప్టెంబర్2020 వరకు UGC – HRDC&RUSA ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్జాల ICT Tools in Higher Education FIP లో పాల్గొని పూర్తి చేయడమైనది.

      • భారతీయ భాషల అధ్యయన కేంద్రం మైసూరు ఆధ్వర్యంలో 7డిసెంబర్2020 నుండి 11 డిసెంబర్ 2020 వరకు జరిగిన తెలుగు భాషలో పరీక్ష మూల్యాంకనం పై ఆన్లైన్ జరిగిన కార్యశాలలో పాల్గొనడమైనది.

      • Institute of Academic Excellence 18&19 జనవరి 2021లలో నిర్వహించిన రెండు రోజుల NIRF India Rankings-2021 for Higher Educational Institutions ఆన్లైన్ కార్యశాలలో పాల్గొనడమైనది.

      • ఫిబ్రవరి 04, 2021 నాడు జూమ్ ద్వారా ప్రభుత్వ మహిళా డిగ్రీ &పి. జి కళాశాల కరీంనగర్ ఆహ్వానం మేరకు జూమ్ ద్వారా “బసవ పురాణం -భాషా విశ్లేషణ” అంశంపై విస్తృతోపన్యాసం ఇవ్వడమైనది. 

      • మార్చ్ 03, 2021 నాడు తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల నిర్మల్ నిర్వహించిన వెబినార్లో ప్రధాన వక్తగా పాల్గొని తెలంగాణ భాషా విశిష్టత అంశంపై ఉపన్యసించడమైనది.

      • Institute of Academic Excellence 21&22 జూన్ 2021లలో నిర్వహించిన రెండు రోజుల National work shop for Higher Educational Institutions on Transformation through NAAC Accreditation Process లో పాల్గొనడమైనది.

      • SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు మద్రాసు విశ్వవిద్యాలయ సంయుక్త నిర్వహణలో తెలుగు కథ-సమకాలీనత అంశంపై తేదీ: 2జులై2021 నాడు జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పాల్గొని పత్ర సమర్పణ చేయడమైనది.

      • SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు మద్రాసు విశ్వవిద్యాలయ సంయుక్త నిర్వహణలో తెలుగు కథ-సమకాలీనత అంశంపై తేదీ: 3 జులై2021 నాడు జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పాల్గొని ఆరవ సెషన్ కు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడమైనది.

      • శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల, చెన్నై వారు 5,6,7 జులై2021 లలో నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పాల్గొనడమైనది.

      • శ్రీ మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దేవరకొండ వారి ఆహ్వానం మేరకు ‘సినారె ప్రపంచ పదులు-మానవ వికాస సూత్రాలు’అంశంపై అంతర్జాలం ద్వారా తేదీ: 16సెప్టెంబర్ నాడు ఆతిథ్యుపన్యాసం చేయనైనది.

      • ఆరోరాస్ డిగ్రీ పీజీ కళాశాల హైదరాబాదు తేదీ: 22 మరియు 23 అక్టోబర్ లలో అంతర్జాలంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ FDP నందు పాల్గొనడమైనది.

      • ప్రభుత్వ సిటీ కళాశాల(A)హైదరాబాదు వారు తేదీ: 28 మరియు 29 అక్టోబర్ లలో అంతర్జాలంలో   నిర్వహించిన “డిగ్రీ తృతీయ సం. పాఠ్య గ్రంథం సృజనాత్మక బోధనా పద్ధతులు” కార్యక్రమంలో చర్చా నిర్వాహకునిగా పాల్గొనడమైనది. 

      • జనవరి 31, 2022 నాడు సేవ సాహితీ సంస్థ జూమ్ ద్వారా నిర్వహించిన సాహితీ అవలోకనంలో గౌరవ అతిథిగా పాల్గొనడమైనది. 

      • ఫిబ్రవరి 2, 2022 నాడు ప్రభుత్వ మహిళా డిగ్రీ & పి. జి కళాశాల కరీంనగర్ విద్యార్థులకు జూమ్ ద్వారా “నన్నయ మహా భారతం - తెలంగాణ తెలుగు దనం” అంశంపై విస్తృత ఉపన్యాసం ఇవ్వడమైనది. 

      • మే 13, 2022 నాడు SRR ప్రభుత్వ డిగ్రీ&పి.జి కళాశాల కరీంనగర్ లో “తెలుగు సంస్కృత  సంధులు” అంశంపై విస్తృతోపన్యాసం ఇవ్వడమైనది.  

      • మే 18, 2022 నాడు ప్రభుత్వ డిగ్రీ&పి.జి కళాశాల గోదావరిఖని లో సృజనాత్మక ప్రక్రియలు- సాహిత్యం అంశంపై విస్తృతోపన్యాసం ఇవ్వనైనది. 

      • 9జులై 2022 నాడు తెలంగాణ కుమ్మర సంఘం, వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వెబినార్ లో సిద్ధప్ప వరకవి జీవితం - సాహిత్యం అంశంపై అతిథి ఉపన్యాసం ఇవ్వడమైనది. 

      • 27 అక్టోబర్ నుండి 10 నవంబర్ వరకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూ ఢిల్లీ వారి Advanced Research Methodology Refresher course “A” గ్రేడు తో పూర్తి చేయడమైనది. 

      • 13 నవంబర్ 2022 నాడు కాళోజీ వర్ధంతి సందర్బంగా సిరిసిల్ల సాహితీ మిత్రులు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉపన్యసించడమైనది. 

      • 17&18 నవంబర్ 2022 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో “గుంటక నర్సయ్య పంతులు - జీవితం - సాహిత్యం” పై పత్ర సమర్పణ చేయడమైనది. 

      • 25 నవంబర్ 2022 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేటలో నిర్వహించిన సృజనాత్మక అభివ్యక్తి శిక్షణ కార్యశాలలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొనడమైనది. 


Copy right @ 2024.

Designed and Developed by Centre for Good Governance