Departments


  • Telugu
    • ప్రభుత్వ డిగ్రీ కళాశాల – కూకట్ పల్లి

      తెలుగు విభాగము

      పరిచయము:

      2008 లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూకట్ పల్లి లో ఏర్పాటు చేసిన తొలి నాటి నుండి తెలుగు శాఖ సుశిక్షితు లైన అధ్యాపక బృందం చే సేవలందిస్తు కళాశాలలోని అన్ని  విభాగాలలో తెలుగు భాషాభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్నది. బి.ఏ తో పాటుగా బి.కాం మరియు బి.యస్సీ లలో అత్యధిక శాతం విద్యార్థులు తెలుగును ద్వితీయ భాష గా స్వీకరించుటలో తెలుగు అధ్యాపకుల కృషి ఎంతగానో ఉన్నది.

              పాఠ్య, మరియు సహ పాఠ్యాంశములను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటు, సమకాలీన అంశాలను విద్యార్థులకు భోదిస్తు తెలుగు విభాగం కళాశాలలోనే ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.

      అత్యంత నగరీకరణ చెందిన కూకట్ పల్లి ప్రాంతం లో కళాశాల ఉన్నప్పటికినీ 1500 మంది విద్యార్థులకు గాను  దాదాపు 1000కి పైగా విద్యార్థులు అనగా 67% మంది తెలుగును ద్వితీయభాషగా స్వీకరించారని సగర్వంగా తెలియజేస్తు తెలుగు విభాగం తన భవిష్య ప్రణాళికను అమలు చేయుటకు నిబద్దతతో కట్టుబడిఉంది.

       

      అధ్యాపకుల వివరాలు:

      ప్రస్తుతం తెలుగు విభాగం లో ముగ్గురు రెగ్యులర్ అధ్యాపకులకు తోడుగా ఒక అతిథి అధ్యాపకుడు సేవలందిస్తున్నారు.  వారిలో ఇద్దరు డాక్టరేట్లు కాగా మరో ఇద్దరు తమ పరిశోధన కొనసాగిస్తున్నారు.

      డా. బి.భవాని గారు ప్రఖ్యాత హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి, మరియు డా. ఎం. రమేశ్ బాబు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తమ తమ అభిరుచి గల అంశాలలో పరిశోధనలు చేసి పరిశోధనా ఫలాలను తమ తోటి అధ్యాపకులు మరియు విద్యార్థులతో పంచుకుంటున్నారు.రాఘవేంద్ర రావు సర్ మరియు ఎల్లప్ప (గెస్ట్) అధ్యాపక బృందం కూడా ఉన్నారు . తెలుగు విభాగం లోని అధ్యాపకుల సగటు బోధనానుభవం కళాశాల లోని ఇతర విభాగముల కంటే ఎక్కువగా అనగా  20 సంవత్సరములుగా ఉంది.

      ఉత్తమ పద్ధతులు:

      విద్యార్థి సదస్సులను, అంతర్జిల్లా కార్యశాలలను మరియు ప్రముఖ కవుల జయంతి ఉత్సవాలను జరుపుటను తెలుగు విభాగం తన ఉత్తమ పద్ధతులుగా అనుసరిస్తూ విద్యార్థులకు సహపాఠ్యాంశాలపై ఆసక్తిని కలిగిస్తుంది. అంతే కాక ఎం. ఏ ( తెలుగు ) అర్హత పరీక్ష రాయగోరు విద్యార్థులకు తగిన పాఠ్యప్రణాళికను రూపొందించి వారికి శిక్షణ ఇవ్వడం కూడా విభాగపు ఉత్తమ పద్ధతిగా అనుసరిస్తున్నది.

      భవిష్యప్రణాళికలు:

      తెలంగాణ బాషా దినోత్సవం 

      విస్తృత ఉపన్యాసం 

  • Telugu
Copy right @ 2024.

Designed and Developed by Centre for Good Governance