Home     Back

Paper on effect of cinema in india


 భారత దేశ సంస్కృతి పైన వెండి తెర ప్రభావం

సంక్షిప్తం :

భారత దేశం లో ఎన్నో జాతులు మరియు ప్రాంతీయ సంస్కృతులు కనిపిస్తాయి. ఐన ఒక ఏకరూపత కనిపిస్తుంది . సామాజిక జీవన శైలి మరియు ప్రజా సంబంధాల విషయం లో ఒక నిగూడమైన విధానం దేశం అంతటా కనిపిస్తుంది  . ధర్మం , విలువలు , నీతి ఆధారిత మైన సమాజ నిర్మాణం దేశం ను అంతర్జాతీయ స్థాయి లో గౌరవింప చేస్తాయి. అలాంటి సంస్కృతి ని కూకటి వేళ్ళ తో సహా పెకిలించే ప్రక్రియ లో వెండి తెర, ముఖ్యం గా బాలివుడ్, పాత్ర పంచుకుంటున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.

ముఖ్య పదాలు : భారత దేశ జీవన విధానం , వెండి తెర ,ప్రభావం

******

పరిచయం :

భారత దేశం లో వెండి తెర ఆవిష్కరింపబడిన తొలి నాల్ల లో ఎక్కువగా పౌరాణిక నేపథ్యం గల సినిమాలను ఆడించేవారు. పాత్రలు, వారి జీవన విధానం కూడా ప్రాంతీయ జీవన విధానానికి దగ్గరగా ఉండేది. విలువలు , కుటుంబ విధానాలు, సత్సంబందాలు ఎక్కువుగా కనిపించి రమణీయమైన సంగీత తో అలరించేవి. ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తి విభిన్నం గా కనిపిస్తుంది. ఈ నాటి సినిమా లలో ఎంత సేపు ప్రేమ కథలు , ఘర్షణలు , రౌడీయిజం ని ప్రదర్శిస్తున్నారు. వినోదం తక్కువ , వినాశనం ఎక్కువ కనిపిస్తుంది.

టాలివుడ్ మరియు బాలివుడ్ :

టాలివుడ్ సినిమాలలో ఎంత సేపు ప్రేమ కథా సినిమాలే ఎక్కువ కనిపిస్తాయి . కొంచం అటు ఇటు గా ఫైటింగ్ చిత్రీకరణ కూడా ఎక్కువుగానే కనిపిస్తుంది. వీటి లో ముఖ్యం గా కాలేజీ కి వెళ్ళే అమ్మాయి అబ్బాయి పరంగా సినిమాలు నడపటం , కాలేజి విద్యార్థుల జీవన విధానం ను తప్పు తోవ పట్టిస్తుంది. కెరీర్ ల ను రూపు దిద్దే కాలేజీ లను అడ్డాలు గా చిత్రీకరించటం , కాపీ కొట్టే విధానం ను మరియు రౌడియిజం ని హీరోయిజం గా చూపించటం నిజం గా కళాశాలల మర్యాదలకు సిగ్గు చేటు గా అనిపిస్తాయి. అంతే కాకుండా, యువత ను తప్పు తోవ పట్టిస్తున్నాయి .

బాలివుడ్ అయితే చెప్పనవసరం లేదు . హీరోయిన్ పాత్ర ను హేయకరమైన భావజాలం , వస్త్రాలంకరణ మరియు అభ్యంతర కరమైన సన్నివేశాలు సమాజం లో పెరుగుతున్న నేర ప్రవృత్తి కి కారణం అవుతున్నాయి. అన్ని రకాల సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. ఆఖరికి కుటుంబ వ్యవస్థను కూడా కించ పరుస్తున్నాయి

ముగింపు : దేశం లో సెన్సార్ బోర్డు లు సక్రియం అయి సరియైన దిశానిర్దేశం చేయాలి. కటినమైన చట్టాలు రావాలి . ప్రజలు కూడా సరిగా లేని చిత్రాలను ఆదరించకూడదు.

References:

Bhugra, D. (2006). Mad Tales from Bollywood. 18

Butalia, U. (1984). Women in Indian Cinema. Feminist Review, (17), 108-110

***********************

COMMISSIONERATE OF COLLEGIATE EDUCATION
3rd Floor, Prof. Jayashankar Vidya Bhavan,
Nampally,
Hyderabad - 500 001.

Designed & Developed by :

Content owned, maintained and updated by COMMISSIONERATE OF COLLEGIATE EDUCATION, Govt. of Telangana.